మూవీడెస్క్: యంగ్ హీరో సందీప్ కిషన్ తెలుగు, తమిళ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇటీవల ధనుష్ రాయన్ చిత్రంలో కీలక పాత్ర పోషించి రెండు భాషల్లో ప్రేక్షకులను మెప్పించాడు.
ప్రస్తుతం సందీప్ కిషన్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన మజాకా సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
మొదట ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, పోటీ ఎక్కువగా ఉండటంతో వాయిదా పడినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, సందీప్ కిషన్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను తమిళంలో ప్లాన్ చేశాడు.
ఈ సినిమా విశేషం ఏమిటంటే, దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ నటించనున్నాడు.
జాసన్ సంజయ్ హీరోగా కెరియర్ ప్రారంభిస్తాడనుకున్నా, ఆయన అనూహ్యంగా దర్శకత్వాన్ని ఎంచుకున్నాడు.
ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మిస్తోంది.
సందీప్ కిషన్ హీరోగా, థమన్ సంగీత దర్శకుడిగా ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రారంభం కానుంది.
సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. విజయ్ అభిమానులు కూడా జాసన్ సంజయ్ తొలి చిత్రంపై ఆసక్తిగా ఉన్నారు.
తమిళనాట ఈ సినిమా సందీప్ కిషన్‌కు పెద్ద బ్రేక్ అందించే అవకాశాలు ఉన్నాయి.
సందీప్ గతంలో వెంకట్రాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు.
అయితే ఆ తర్వాత అతనికి పెద్దగా కమర్షియల్ సక్సెస్‌లు లభించలేదు.
ప్రస్తుతం మజాకాపై ఆశలు పెట్టుకున్న సందీప్, జాసన్ సంజయ్ చిత్రంతో తమిళ మార్కెట్‌లో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకోవాలని చూస్తున్నాడు.
విజయ్ కుమారుడి డైరెక్షన్ కావడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.