టాలీవుడ్: కమెడియన్ గా సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడే హీరోగా అందాల రాముడు, మర్యాద రామన్న లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో హీరోగా విజయాలు సాధించి ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేస్తున్నాడు సునీల్. ఈ మధ్య మళ్ళీ కమెడియన్ గా కొన్ని క్యారెక్టర్లు చేసినా కూడా అంతగా గుర్తింపు రాలేదు. ‘డిస్కో రాజా’, ‘కలర్ ఫోటో’ సినిమాల్లో విలన్ గా కూడా నటించాడు సునీల్. ప్రస్తుతం సునీల్ హీరోగా మరో సినిమా రూపొందబోతుంది. ఈ రోజు సునీల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు.
A టీవీ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టి.జి.విశ్వ ప్రసాద్, కిషోర్ గరికపాటి, అర్చన అగర్వాల్ నిర్మాణంలో ‘మర్యాద క్రిష్నయ్య’ అనే సినిమా రూపొందబోతున్నట్టు ఇవాళ ప్రకటించారు.’ మనసంతా నువ్వే’ ,’నేనున్నాను’ లాంటి సినిమాలని రూపొందించిన వీ.ఎన్.ఆదిత్య ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అమాయకపు చూపుతో కనిపిస్తున్నాడు. దాదాపు మర్యాద రామయ్య టైటిల్ ని వాడుకున్నట్టు సినిమాలో కూడా సునీల్ కారెక్టర్ అలాగే ఉండబోతుందా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే హీరోగా ప్లాప్ లని మూటగట్టుకుంటున్న సునీల్ మళ్ళీ అలాంటి కథ కాకుండా కొత్త కథలని ఎంచుకుంటే బాగుంటుందని సినీ అభిమానులు ఆశ వ్యక్తం చేస్తున్నారు.