fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsసునీల్ హీరోగా 'వేదాంతం రాఘవయ్య'

సునీల్ హీరోగా ‘వేదాంతం రాఘవయ్య’

SunilNewMovie VedantamRaghavayya AsHero

హైదరాబాద్: కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి, తర్వాత హీరో గా మారి కొన్ని హిట్స్ ఇచ్చి వరుస ప్లాప్ ల తర్వాత మళ్ళీ కమెడియన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల కోసం సునీల్ ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా పాత్రలు వేసినా కూడా అవి అంతగా ఆకట్టుకోకపోవడం తో సునీల్ కెరీర్ ఇంకా గాడి లో పడలేదు. ఈ మధ్యనే కలర్ ఫోటో అనే సినిమాలో సునీల్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం సునీల్ మరొక సినిమాతో హీరోగా రాబోతున్నాడు.

‘వేదాంతం రాఘవయ్య’ అనే పేరున్న ఈ సినిమాతో మళ్ళీ హీరోగా రాబోతున్నాడు సునీల్. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకి కథ అందిస్తున్నాడు. కథ మాత్రమే కాకుండా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామి కూడా. హరీష్ శంకర్ తో పాటు ఈ సినిమాని 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఇంకా డైరెక్టర్ కన్ఫర్మ్ కానీ ఈ సినిమాకి మిగతా డీటెయిల్స్ త్వరలో ప్రకటించబోతున్నారు అనౌన్స్ చేసారు సినిమా మేకర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular