fbpx
Thursday, January 30, 2025
HomeInternationalఅంతరిక్షంలోనే 7 నెలలు.. సునీతా పరిస్థితి ఎలా ఉందంటే..

అంతరిక్షంలోనే 7 నెలలు.. సునీతా పరిస్థితి ఎలా ఉందంటే..

sunita-williams-space-mission

యూఎస్: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో 7 నెలలుగా చిక్కుకుపోయారు. 2023 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన ఆమె, కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లినా సాంకేతిక సమస్యల కారణంగా భూమికి తిరిగి రాలేకపోయారు.

వాస్తవానికి జూన్ 14న రాగలిగేవారు కానీ, నాసా పలు సాంకేతిక లోపల కారణంగా అనేకసార్లు వాయిదా వేసింది. తాజాగా ఓ వర్చువల్ సెషన్‌లో సునీతా విలియమ్స్ మాట్లాడుతూ, 7 నెలలుగా నడవలేదని, కూర్చోలేదని, పడుకోలేదని వెల్లడించారు.

శూన్య గురుత్వాకర్షణ ప్రభావంతో శరీరం నిరంతరం తేలియాడుతూనే ఉందని, భూమిపై నడిచిన అనుభూతిని కూడా గుర్తు చేసుకోలేకపోతున్నానని తెలిపారు.

ఈ నేపథ్యంలో, స్పేస్ ఎక్స్ క్రూ-10 మిషన్ ద్వారా ఆమెను భూమికి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ట్వీట్ చేస్తూ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు తెలిపారు.

మార్చి చివరి లేదా ఏప్రిల్ మొదటి వారంలో సునీతా భూమికి తిరిగి చేరుకునే అవకాశం ఉంది. భూమి వాతావరణానికి ఆమె శరీరం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular