బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ తాజాగా జాట్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో సన్నీ తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో అభిమానుల్లో మరోసారి ఆయనపై నమ్మకం పెరిగింది.
అయితే ఇప్పుడు సన్నీ డియోల్ ఓ విభిన్న నిర్ణయం తీసుకున్నాడు. 2018లో వచ్చిన మలయాళ బ్లాక్‌బస్టర్ జోసెఫ్ సినిమాను సూర్య అనే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నాడు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం కథాసారాన్ని హిందీ ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతున్నాడు.
తెలుగులో ఇదే కథను శేఖర్ టైటిల్‌తో హీరో రాజశేఖర్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అది బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. దాంతో ఇప్పుడు సన్నీ డియోల్ ఇలా ఔట్ డేటెడ్ కథను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సన్నీ డియోల్ మాస్ ఫాలోయింగ్ ఉన్నా కూడా, కథలో బలహీనత ఉంటే భారీ విజయాన్ని అందుకోవడం కష్టమే. సూర్య సినిమాతో సన్నీ మళ్లీ మరో హిట్ అందుకుంటాడా లేక రిస్క్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.
sunny deol, surya movie, joseph remake, bollywood news, sunny deol new movie,