చెన్నై: కొత్త సంవత్సరం రోజున పార్టీ ప్రకటిస్తానని తన పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తెలిపారు. అందరూ రజిని పార్టీ గురించి ఎన్నో కళలు కంటున్న సందర్భంలో అనూహ్యంగా రజిని ఆరోగ్యం విషమించి హాస్పిటల్ లో చేరడం, తన ఆరోగ్యం దృష్ట్యా రాజకీయాల్లోకి రాకుండా ఉండడం లాంటి నిర్ణయాలు తీసుకోవడం చక చకా జరిగిపోయాయి.
తన ఆరోగ్యం పూర్తిగా రాజకీయాల్లోకి రావడానికి సహకరించట్లేదని, పార్టీ పెట్టకుండా ప్రజలకి సేవ చేస్తానని రజినీకాంత్ ఇవాల ఉదయం తెలిపారు. అంతే కాకుండా తన పార్టీ పైన ఎంతో ఆశలు పెట్టుకున్న జనాలకి, కార్య కర్తలకి తన అభిమానులకి క్షమాపణలు కూడా తెలియచేసారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు అని తాను తిరిగితే తన ఆరోగ్యానికే ముప్పు పొంచి ఉందని డాక్టర్ ల సూచన మేరకు రాజకీయాల్లోంచి వైదొలుగుతున్నానని తెలిపారు.
ఈ మధ్యన రజిని కాంత్ అస్వస్థకు గురి అయ్యి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. దాదాపు వారం రోజులు హైదరాబాద్ లో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జి అయ్యారు. తన అనారోగ్యం కారణంగా ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. దాని వల్ల చాలా మంది పనులు ఆగిపోయాయి. అలాంటిది తనకి ఏదైనా అయితే తనని నమ్ముకున్న వాళ్లందరికీ చాలా రకాలుగా నష్టపోతారని ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈ నిర్ణయం పై రజినీకాంత్ కి సహకరించినవాళ్లున్నారు అలాగే విమర్శించినవాళ్లు కూడా ఉన్నారు. ఏది ఏమైనా చివరకి అది ఆయన సొంత నిర్ణయం .