టాలీవుడ్: కరోనా వచ్చి అయిదు నెలలుగా థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. క్షేత్రస్థాయిలో దీని మూలంగా నష్టపోయిన వాల్లు కో కొల్లలు. అన్లాక్ లు వస్తున్నా కూడా థియేటర్లు తెరచుకోవడానికి మాత్రం అవకాశాలు రావట్లేదు. ఇంకా థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనపడకపోవడం తో విడుదలకి సిద్ధం ఉన్న సినిమాలని నష్టాల భారం మొయ్యలేక ఎంతో కొంతకి ఓటీటీ లకి అమ్మేస్తున్నారు. మామూలుగానే మన దగ్గర థియేటర్ బిజినెస్ లు అంతంత మాత్రం. పండగకు లేదో సంవత్సరానికి ఒకేసారి ఒక థియేటర్ కి ఒక్క హిట్ సినిమా పడితే వాళ్ళకి అదే ఆనందం. ఇప్పడు ఆ అవకాశాము కూడా లేకపోవడం తో థియేటర్ లు కళ్యాణ మండపాలుగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే చాలా అయ్యాయి కూడా.
మొదలు చిన్న సినిమాలు ఓటీటీ కి అమ్ముకున్నారు. దాని వాళ్ళ థియేటర్ లకి పెద్ద ప్రభావం ఏమి లేదు. ఇపుడు మెల్లి మెల్లిగా పెద్ద సినిమాలు కూడా ఓటీటీ కి రావడం తో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే జనాలు ఓటీటీ కి అలవాటు పడితే ఇంకా థియేటర్లు మూసుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానీ, థియేటర్లో సినిమా చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ , కానీ థ్రిల్ కానీ ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో చూస్తే రాదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న థియేటర్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్స్ ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. #SupportMovieTheatres , #SaveCinema అనే హాష్ టాగ్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం టాక్స్ లు కట్టుకోవడానికి, మినిమం కరెంట్ బిల్లులు కట్టుకోవడానికి కూడా ఆదాయం రాకపోవడం తో థియేటర్ యాజమాన్యాలు గడ్డు పరిస్థితులని ఎదురుకొంటున్నాయి. దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి , కొవిడ్ నిబంధనలతో థియేటర్ లని తెరుచుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు థియేటర్ ఓనర్స్ మరియు ఎగ్జిబిటర్స్.