న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెట్టింది.
తీర్పు వివరాలు: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ వర్గీకరణ అవసరమని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తీర్పును వెలువరించింది. మూడ్రోజులు పాటు వాదనలు విన్న తర్వాత, తీర్పును ఇవాళ వెల్లడించింది.
వివాదం నేపథ్యం: వాల్మీకులు, ముఝాబీ సిక్కులను 50% రిజర్వేషన్ కల్పించిన నిబంధనను పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చింది. దీనిపై వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 2002లో ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. ఈ అంశంపై పున:సమీక్షించుకోవాలని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది.