fbpx
Thursday, December 26, 2024
HomeNationalసుప్రీంకోర్టు కరోనా కట్టడికై కీలక ఆదేశాలు

సుప్రీంకోర్టు కరోనా కట్టడికై కీలక ఆదేశాలు

SUPREME-PREPARES-12MEMBERS-TASKFORCE-TO-MONITOR-VACCINE-OXYGEN

న్యూఢిల్లీ : దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కట్టడికి ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది సభ్యులతో సుప్రీం కోర్టు ఒక టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సూప్రీం ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్ లో వెస్ట్‌ బెంగాల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ భబతోష్‌ బిశ్వాస్‌, గుర్గావ్‌ మేదాంత హాస్పిటల్‌ అండ్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్‌ పర్సన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.నరేష్‌ ట్రెహన్‌ ఇందులో సభ్యులుగా ఉన్నారు.

టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న 12 మందిలో వైద్య నిపుణులు, డాక్టర్లు ప్రభుత్వం నుంచి ఇద్దరు వ్యక్తులు కూడా భాగం కానున్నారు. ఈ కమిటీకి క్యాబినేట్‌ సెక్రటరీ టాస్క్‌ఫోర్స్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ బృందం దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ మరియు ఆక్సిజన్‌ పంపిణీని పర్యవేక్షిస్తుంది.

అలాగే కోవిడ్ చికిత్స కోసం అవసరమైన ఔషధాల అందుబాటును, మహమ్మారి కారణంగా ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలను ఈ కమిటీ అందజేస్తుంది. రాబోయే ఒక వారం రోజుల్లోగా ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందం తమ సేవలు అందుబాటులోకి తేనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular