fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsమ్యూజిక్ బిజినెస్ లోకి సురేష్ ప్రొడక్షన్స్

మ్యూజిక్ బిజినెస్ లోకి సురేష్ ప్రొడక్షన్స్

SureshProductions Launching SPMusicLabel

టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థ గా వెలుగుతుంది. దాదాపు 50 సంవత్సరాలు సినిమాలు నిర్మిస్తున్న ఈ సంస్థ గత కొన్ని సంవత్సరాల్లో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగింది. సినిమాల నిర్మాణం తగ్గినా కూడా తీస్తున్న సినిమాల క్వాలిటీ తగ్గకుండా చూసుకుంటున్నారు ఈ ప్రొడక్షన్ హౌస్. రామానాయుడు తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ ని రామానాయుడు కొడుకు సురేష్ బాబు, మనవడు రానా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ ‘సురేష్ ప్రొడక్షన్ మ్యూజిక్’ అనే కొత్త మ్యూజిక్ లేబిల్ ని స్థాపించింది.

ప్రొడక్షన్ హౌస్, రామానాయుడు ఫిలిం లాబ్స్, రామానాయుడు స్టూడియోస్, డిస్ట్రిబ్యూషన్ ఇలా అన్ని రంగాల్లో తమ ఉన్నతిని చూపుతున్న సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ నిర్ణయం తో మ్యూజిక్ రంగంలో కూడా వెలుగు వెలగాలని చూస్తున్నారు. త్వరలో ఓటీటీ కూడా మొదలు పెట్టనున్నారు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ నుండి రానున్న నారప్ప, దృశ్యం 2 సినిమాలు ఈ మ్యూజిక్ లేబుల్ తో రానున్న మొదటి సినిమాలు అని అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular