హైదరాబాద్: దేశంలో కరోనా మొదలైన రోజు నుండి ఈ రోజుకి ఎన్నో రెట్లు కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ వ్యాప్తి ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదు. మొదట్లో కరోనా రాకుండ ప్రయత్నం చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చాక ఎలా ఎదుర్కొనాలి, ఎలా ప్రజలను కాపాడలి అనే పనిలో నిమగ్నమయ్యాయి.
మొదట్లో రోజుకు అంకె లో వచ్చే కేసులు సంఖ్యగా మారి ఇప్పుడు రోజుకు వేల కేసులకు చేరింది. మొదట్లో దేశంలో వందల్లో కేసులు ఉన్నప్పుడు ఇంటికి పరిమితం అయిన ప్రజలు ఇప్పుడు లక్షల్లో కేసులు ఉన్నా భయపడకుండా రోడ్ల మీద తిరుగుతూ సామాజిక దూరం మరచి, మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నారు.
ఇప్పటికే దేశంలో కేసులు 10 లక్షల మార్కును దాటి 20 లక్షలకు దూసుకెళ్తోంది. అయినా ప్రజలలో మార్పు లేదు. ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు పాజిటివ వస్తే ఆసుపత్రి కి తీసుకెల్లేవారు, ఇప్పుడూ హొం క్వారంటైన్ అనో లేదంటే కోవిడ్ కేర్ సెంటర్ కో తరలిస్తున్నాం అంటున్నారు.
ఇప్పుడు రాష్ట్రాలు మెడికల్ సదుపాయాలు పెంచడంలో అలాగే వేలల్లో బెడ్స్ సిద్ధం చేస్తున్నాయి. ఇదంతా చూస్తే రాబోయే రోజుల్లో ఈ కేసులు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
దీన్ని బట్టి కరోనా మహమ్మారి యొక్క సామాజిక సంక్రమణం మొదలైందని నిపుణులు అంటున్నారు. ఈ వ్యాప్తి ఉదృతి ఆగష్టులో ఇంకా అధికమయ్యే సూచనలు ఉన్నట్లు చెబుతున్నారు. అసలే వర్షా కాలం, సీజనల్ రోగాలు పెరిగే కాలం, దీనికి తోడు కరోనా ఈ వాతావరణంలో త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు.
అదే జరిగితే ఇప్పుడు వేలల్లో వచ్చే కేసులు త్వరలో లక్షల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉధృతి నవంబర్, డిసంబర్ వరకు తగ్గే సూచనలు లేనట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే తరుణంలో కేసులు కోటి కి చేరే ప్రమాదం ఉందంటున్నారు. ప్రజలు జాగ్రత్త వహించాలి.