fbpx
Friday, November 29, 2024
HomeAndhra Pradeshసరస్వతి పవర్ భూముల్లో సర్వే - డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు

సరస్వతి పవర్ భూముల్లో సర్వే – డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు

Survey in Saraswati Power lands – Deputy CM Pawan orders

ఆంధ్రప్రదేశ్: సరస్వతి పవర్ భూముల్లో సర్వే – డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు

పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్‌ సంస్థకు చెందిన భూములపై అధికార యంత్రాంగం సర్వే చేపట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు డీఆర్వో నేతృత్వంలో అటవీశాఖ సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. సరస్వతి పవర్‌ సంస్థ భూముల్లో అటవీ భూములు, వాగులు, వంకలు, ప్రకృతి సంపద, వాటి విస్తీర్ణం, ప్రభుత్వ భూముల స్థితిగతులు పరిశీలించాలని పవన్ సూచించారు.

1515.93 ఎకరాల సమగ్ర సర్వే – వనరుల వివరాలు సేకరణ

సరస్వతి పవర్ భూముల్లో వాగులు, వంకలు, పర్వతాలు, ప్రకృతి సంపద ఉన్నాయని వచ్చిన సమాచారం ఆధారంగా, ఈ భూముల్లో ప్రభుత్వ భూములు, జల వనరులు ఎంతవరకు ఉన్నాయో, సర్వే ద్వారా వెల్లడించాలని పవన్ ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) అధికారులను సైతం ఆదేశించారు. ఈ భూములకు పర్యావరణ అనుమతులు తీసుకోవడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో పీసీబీ అధికారులు సమగ్రంగా నివేదిక ఇవ్వాలని కోరారు.

జగన్-షర్మిల మధ్య భూముల వివాదం – సర్వే ప్రాధాన్యత

సరస్వతి పవర్ సంస్థకు సంబంధించిన ఈ భూముల విషయంలో జగన్, షర్మిల మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లి ఆస్తులన్నీ తనకే చెందుతాయని వాదించారు. అప్పట్లో ఈ భూములను రైతుల నుంచి ఎకరా రూ.3 లక్షల చొప్పున కొనుగోలు చేసి, ప్రస్తుతం భూముల్లో ఉన్న ప్రకృతి వనరులు, అటవీ భూములు, ప్రభుత్వ స్థలాలను సమీక్షించడానికి ఈ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది.

సమగ్ర నివేదిక సిద్ధం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు, ఈ వివాదంలో ప్రకృతి వనరుల పరిరక్షణ, పర్యావరణ చట్టాలు పాటించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. దీనిపై అటవీ, రెవెన్యూ, పీసీబీ అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular