fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsమరోసారి ఆలస్యం అవుతున్న సూర్య సినిమా

మరోసారి ఆలస్యం అవుతున్న సూర్య సినిమా

Surya AaakashameHaddura DelayInRelease

కోలీవుడ్: సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఈ నెల 23 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవ్వాల్సి ఉంది. ఈ సినిమా ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి ఆర్ గోపినాథ్ కథ ఆధారంగా రూపొందుతుంది. ఈ సినిమాలోని కొన్ని అంశాలు డిఫెన్స్ , అవియేషన్స్ కి సంబందించినవి ఉన్నాయి. అలాంటి సన్నివేశాలు ఉన్నపుడు ఈ సినిమాకి ఇంకొన్ని క్లియరెన్స్ లు తెచ్చుకోవాలి , జాతీయ సెక్యూరిటీ కి సంబందించిన అంశం కాబట్టి అవన్నీ తప్పక పాటించాలి.. అవి క్లియరెన్స్ లు తెచ్చుకున్న తర్వాతనే సినిమాని విడుదల చేస్తాం అని ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు , రూమర్స్ కి తావు లేకుండా ఉన్న విషయం చెప్తున్నాము అని సూర్య ట్వీట్ చేసాడు.

ఈ సినిమాని చాలా ఇష్టపడి చేసాం. సినిమా షూటింగ్ చేసేపుడు వివిధ ప్రాంతాల్లో, వివిధ బాషల కోసం.. కొన్ని లొకేషన్స్ లో అనుమతుల కోసం చాలా కష్టపడ్డాం. ఇపుడు సినిమాలు విడుదల చేసేపుడు కూడా ఇంకొన్ని అనుమతుల కోసం కష్టపడ్తున్నాం అని ఈ సినిమా అందరికీ నచ్చుతుందని సూర్య నోట్ ద్వారా చెప్పారు. అలాగే ఈ సినిమాలోని ‘ఫ్రెండ్షిప్’ రిలేటెడ్ సాంగ్ ఒకటి విడుదల చేసారు. ఈ సినిమా ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం లో రూపొందించబడింది. అన్ని అనుమతులు ముగించుకొని దీపావళి వారికి ఈ సినిమాని విడుదల చేస్తారని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular