fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsమరో అరుదైన గౌరవం దక్కించుకున్న సూర్య సినిమా

మరో అరుదైన గౌరవం దక్కించుకున్న సూర్య సినిమా

Surya AakashameNeeHaddura RareFeet

కోలీవుడ్: కరోనా వేవ్ 1 లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా మంచి రెస్పాన్స్ తో సూపర్ హిట్ టాక్ సంపాదించింది. సూర్య అద్భుతమైన నటనకి, సుధా కొంగర దర్శకత్వానికి మంచి పేరు లభించింది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ కి కూడా పంపడం జరిగింది కానీ చివరి వరకు పోటీలో నిలబడలేకపోయింది. పోయిన సంవత్సరం విడుదలైన ఈ సినిమా ఇంకెన్నో అవార్డులు పొందింది. ప్రస్తుతం ఈ సినిమా షాంఘై ఇంటెర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ – 2021 లో పనోరమా సెక్షన్ లో ఎంట్రీ పొందింది. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గుర్తింపు రావడం ఇది రెండవది.

ఇది మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా విడుదలయ్యే సినిమాలకి IMDB అనే మూవీ డేటాబేస్ వెబ్ సైట్ లో రేటింగ్స్ ఇస్తారు. వరల్డ్ వైడ్ రేటింగ్స్ ఉండే ఈ వెబ్ సైట్ లో టాప్ రేటింగ్స్ లో మూడవ సినిమాగా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాకి 59674 రేటింగ్స్ లభించాయి అందులో 48000 మంది ఈ సినిమాకి టెన్ స్టార్ (10 ) రేటింగ్ ఇచ్చారు. మన సౌత్ ఇండియన్ సినిమాకి ఇంత గుర్తింపు రావడం ఇదే మొదటిది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపినాథ్ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఇంకా ఎన్నో అవార్డుల్ని పొందాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular