fbpx
Sunday, December 22, 2024
HomeMovie Newsఓటీటీ లో సూర్య మరో సినిమా

ఓటీటీ లో సూర్య మరో సినిమా

Surya JaiBheem OTTRelease

కోలీవుడ్: తమిళ హీరో సూర్య పోయిన సంవత్సరం ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల చేసి మంచి హిట్ సాధించారు. ఆ సినిమా విడుదల విషయంలో డిస్ట్రిబ్యూటర్ ల దగ్గరి నుండి , థియేటర్ యజమానులు దగ్గరి నుండి ఎంత ఒత్తిడి వచ్చినా కూడా సినిమాని ఓటీటీ లో విడుదల చేసారు. తన సొంత నిర్మాణంలో రూపండిన ఈ సినిమాని పోయిన సంవత్సరం నవంబర్ లో విడుదల చేసాడు. ఈ సంవత్సరం నవంబర్ లో మరో సినిమాని ఓటీటీ లో విడుదల చేస్తున్నాడు.

సూర్య ప్రస్తుతం వెట్రి మారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’, పాండి రాజ్ దర్శకత్వంలో ‘ఎత్తారక్కుమ్ తురిందవన్’, జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘జై భీం’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల్లో ‘జై భీం’ ని ఈ సంవత్సరం నవంబర్ లో విడుదల చేయనున్నట్టు ఈరోజు ప్రకటించారు. ఈ సినిమాలో ఒక అడ్వొకేట్ పాత్రలో సూర్య నటిస్తున్నాడు. ట్రైబల్ హక్కుల కోసం పోరాడే లాయర్ పాత్రలో సూర్య కనిపించనున్నాడు.

2d ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య తన సొంత నిర్మాణంలో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. జ్యోతిక మరియు సూర్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, కర్ణన్ ఫేమ్ రాజీషా విజయన్ నటిస్తున్నారు. సీన్ రొల్డన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ లో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular