fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsబాలీవుడ్ లో సూర్య 'ఆకాశం నీ హద్దురా'

బాలీవుడ్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

Surya MovieIn Bollywood

కోలీవుడ్: 2020 నవంబర్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా విడుదలైన సూర్య నటించిన సినిమా ‘సూరారై పోట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ఎంతో మంది సినిమా ప్రేక్షకుల దగ్గరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. థియేటర్ లు తెరుచుకున్న తర్వాత కూడా ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయమని కోరారు సినీ అభిమానులు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు ‘కెప్టెన్ గోపినాథ్ ‘ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సూర్య నటన వేరే స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఈ సినిమాని బాలీవుడ్ లో రీ-మేక్ చేయనున్నారు. ఈ విషయాన్నీ ఈరోజు ప్రకటించారు. ఈ సినిమాలో మరి సూర్య నటిస్తాడా వేరే ఎవరైనా బాలీవుడ్ హీరో ని ఎంచుకుంటారా అనే విషయాన్నీ అయితే ప్రకటించలేదు. ఈ సినిమాని 2d ఎంటర్టైన్మెంట్స్, సిఖ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సూర్య మరియు రాజశేఖర్ పాండియన్ నిర్మించారు. ఇపుడు హిందీ వర్షన్ ని కూడా వీరిద్దరితో పాటు జ్యోతిక మరియు అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనున్నారు. హిందీ లో కూడా ఈ సినిమాకి సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు. ఎంతో టాలెంట్ ఉన్న దర్శకురాలు సుధా కొంగర ఇలా తన కెరీర్ లో తన సినిమాలకే రీ-మేక్ చేయడానికి సమయం వెచ్చించడం ఆమె దగ్గరి నుండి ఇంకా మంచి సినిమాలు ఆశించే అభిమానులకి చేదు వార్తే. ఇదివరకు కూడా ‘గురు’ సినిమాని తెలుగు లో రీమేక్ చేసిన అనుభవం సుధా కొంగర కి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular