fbpx
Friday, November 29, 2024
HomeMovie Newsసూర్య ఈటీ (ఎవరికీ తలవంచడు) సినిమా రివ్యూ!

సూర్య ఈటీ (ఎవరికీ తలవంచడు) సినిమా రివ్యూ!

SURYA-STARRER-ET-MOVIE-BAGS-AVERAGE-TALK

మూవీడెస్క్:
నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్​ మోహన్​, వినయ్​ వర్మ, సత్యరాజ్​ తదితరులు
నిర్మాత: కళానిధి మారన్
రచన, దర్శకుడు: పాండిరాజ్​
సంగీతం: డి. ఇమ్మాన్​
సినిమాటోగ్రఫీ: ఆర్​. రత్నవేలు
ఎడిటర్:​​ రూబెన్​
విడుదల తేది: మార్చి 10, 2022

ఎప్పుడూ భిన్నమైన కథతో మరియు రోల్స్​లో అదరగొట్టే సూర్య సినిమాలపై భారీగానే అంచనాలు ఉంటాయి. ఇదివరకూ సూర్య చేసిన ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’​ సినిమాలు కరోనా కారణంగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. అయినప్పటికీ అవి మంచి బ్లాక్​ బస్టర్ హిట్లు​ సాధించాయి. దాదాపు మూడేళ్ల విరామం తరువాతత సూర్యా చిత్రం ‘ఎవరికీ తలవంచడు’తో థియేటర్లలో ప్రేక్షకులను అలరించాడు.

ఈ చిత్రం మార్చి 10న (గురువారం) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. మరీ సూర్య నటించిన ఈటీ ఎలా ఉందో రివ్యూ ఇక్కడ చూద్దాం.

కథ:
దక్షిణపురంలో అందరితో సరదాగా గడుపుతూ జీవిస్తుంటాడు లాయర్ కృష్ణమోహన్​ (సూర్య). ఇతడు ఉత్తరపురంలోని అధిర (ప్రియాంక అరుల్​ మోహన్​)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు ప్రేమించుకునే క్రమంలోనే వారి గ్రామంలోని అమ్మాయిలు ఆత్మహత్యలు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతుంటారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం ఫలితముండదు.

ఇదిలా ఉంటే కృష్ణ మోహన్​, అధిరలు పెళ్లి చేసుకునే క్రమంలో అధిర స్నేహితురాలు ఆపదలో ఉన్నట్లు మెసేజ్ వస్తుంది. దీంతో ఆమెను కాపాడేందుకు వెళ్లిన లాయర్​ కృష్ణమోహన్​కు అమ్మాయిల ఆత్మహత్యలు, యాక్సిడెంట్లకు కారణం, ఆ చావుల వెనక ఉంది ఎవరనేది తెలుస్తుంది.

సూర్య వారిని ఎలా ఎదుర్కొన్నాడు? 500 మంది అమ్మాయిలను ఎలా కాపాడాడు ? దక్షిణపురం, ఉత్తరపురం గ్రామాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి ? కృష్ణ మోహన్​ చిన్నతనంలో తన చెల్లెలికి ఏం జరిగిందనేదే సినిమా కథ.

భిన్నమైన గెటప్పులతో, రోల్స్​తో అదరగొట్టే సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎప్పటిలానే ఈ సినిమాలో లాయర్​ కృష్ణ మోహన్​గా తనదైన శైలిలో అద్భుతంగా యాక్ట్​ చేశాడు. అధిరగా చేసిన ప్రియాంక అరుల్​ మోహన్ నటన కూడా బాగుంది.

ఫస్టాఫ్​లో సాధారణ యువతిగా నటించి ఆకట్టుకున్న ప్రియాంక సెకండాఫ్​లో అశ్లీల చిత్రాలకు గురైన బాధితురాలిగా పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనే పాత్రలో చక్కగా నటించింది. ఇక కృష్ణమోహన్ తండ్రిగా సత్యరాజ్, అమ్మగా శరణ్య పొన్​వన్నన్​, దేవదర్శిని చేతన్​, సుబ్బు పంచు తమదైన పాత్రమేరకు చాలా బాగా నటించారు.

మొత్తానికి సూర్య నటించిన ఈ చిత్రం మంచి టాక్ నే సొంతం చేసుకుంది. చాలా వరకు ఈ చిత్రానికి 2/5 రివ్యూలు అందుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular