కోలీవుడ్: తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. సూర్య నటిస్తున్న ప్రతి సినిమాకి ఇక్కడ మంచి బజ్ ఉంటుంది. సినిమా మంచిగా ఉంటే తెలుగు లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ప్రస్తుతం సూర్య వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వడి వాసల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దానితో పాటు సూర్య 40 వ సినిమాగా ‘ఎత్తారెక్కుమ్ తునిందవన్’ అనే టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో కూడా నటిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఈ రోజు ఈ సినిమా టైటిల్ ప్రకటన తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ఈ సినిమా తెలుగు టైటిల్ ఇంకా ప్రకటించలేదు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ఒక చిన్న టీజర్ కూడా విడుదల చేసారు. ఒక పెద్ద కత్తి తిప్పుతూ ఉన్న సూర్య లుక్ ని ఈ వీడియో లో చూడవచ్చు. కత్తితో మాత్రమే కాకుండా గన్ పేల్చుతూ ఉండే ఫైట్ సీక్వెన్స్ ఒకటి చూపించారు. విశాల్ తో కథకళి, కార్తీ తో చిన్నబాబు లాంటి సినిమాని రూపొందించిన పాండిరాజ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య కి జోడీ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతుంది. డి.ఇమాన్ సంగీతం లో రూపొందుతున్న ఈ సినిమాలో మరిన్ని పాత్రల్లో సత్యరాజ్, ఆక్టర్ సూరి నటిస్తున్నారు. రేపు సూర్య పుట్టిన రోజు సందర్భంగా సూర్య కి విషెస్ తెలుపుతూ ఈ ఫస్ట్ లుక్ విడుదల చేసారు.