కోలీవుడ్: సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు అంథాలజీ సిరీస్ లు కూడా బాగానే మొదలయ్యాయి. కొందరు డైరెక్టర్ లు వేరు వేరు కథలతో వేరు వేరు నరేషన్స్ తో చెప్పే కథలన్నీ జోడించి ఒక సిరీస్ రూపం లో ప్రెసెంట్ చేస్తారు. తెలుగు లో ‘పిట్ట కథలు’ అని ఒకే ఒక అంథాలజీ సిరీస్ ని రూపొందించారు కానీ తమిళ్ లో ఇప్పటికీ బాగానే వచ్చాయి. తమిళ్ లో ‘పావ కడైగల్’, ‘పుత్తం పుదు కలై‘ అనే అంథాలజీ సిరీస్ లు రూపొంది సక్సెస్ సాధించాయి. ఇపుడు వీటి బాటలోనే ‘నవ రస‘ అనే అంథాలజీ సిరీస్ రూపొందుతుంది. దీనికి 9 కథలు, 9 డైరెక్టర్ లు పని చేయనున్నారు. దాదాపు తమిళ్ లో ఉన్న టాప్ రేంజ్ హీరోస్, టాప్ రేంజ్ టెక్నీషియన్స్ ఈ సిరీస్ కోసం పని చేయనున్నారు.
ఈ సిరీస్ లో భాగం గా సూర్య ఒక కథ లో నటించనున్నాడు. ఈ పార్ట్ ని ‘గిటార్ కాంబి మేలే నిండ్రు’ అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఈ పార్ట్ ని క్లాస్సి డైరెక్టర్ గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పార్ట్ నుండి ఇవాళ ఒక పోస్టర్ విడుదల చేసారు. ఇందులో సూర్య మరియు ప్రయాగ రోజ్ మార్టిన్ ఒకే హెడ్ సెట్ పెట్టుకుని పాట వింటున్న పిక్ విడుదల చేసారు. సినిమాలో హీరో చాలా యంగ్ లుక్ లో ఒక మ్యూజిషియన్ లాగ కనిపిస్తున్నాడు. ఈ సిరీస్ ని మణి రత్నం మరియు జయేంద్ర నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ నుండి వచ్చిన ఆదాయం కూడా తమిళ ప్రజల సేవార్థం వాడనున్నారు. ఆగష్టు లో నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో ఈ సిరీస్ విడుదల కానుంది.