ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా అందరూ జీర్ణించుకోలేని నిజం. సుశాంత్ మరణం దృష్ట్యా ఇన్ని రోజులైనా నేపోటిజం పైన బాలీవుడ్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా సుశాంత్ నటించిన చివరి సినిమా ‘దిల్ బెచారా‘ జులై 24 న disney+hotstar డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అవుతున్నట్టు అధికారిక ప్రకటన విడుదల అయింది. సుశాంత్ చివరి సినిమా ని థియేటర్ లో రిలీజ్ చేయాలి అని చాలా రిక్వెస్ట్ లు వచ్చిన కూడా నిర్మాతలు ఓటీటీ కె మొగ్గు చూపారు. ‘సుశాంత్ మీద ప్రేమతో , సుశాంత్ కి సినిమా మీద ఉన్న ప్రేమతో ఈ సినిమా ని ప్రీమియం యూజర్స్ కి అలాగే నాన్ ప్రీమియం యూజర్స్ కి అందుబాటులో ఉంచుతున్నట్టు’ hotstar టీం ప్రకటించింది.
ముఖేష్ చాబ్రా దర్శకత్వం వచించిన ఈ సినిమాని ఫాక్స్ స్టార్ట్ స్టూడియో బ్యానర్ పైన నిర్మించారు.ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ ఏ ఆర్ రెహమాన్ సంగీతం. ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఇద్దరు కాన్సర్ పేషెంట్స్ మధ్య జరిగే ప్రేమ కథలా ఈ సినిమా తెరకెక్కించారు. సుశాంత్ కి జోడీ గా సంజన సంఘీ నటించారు. ఇలాంటి కథ పైన తెలుగు లో ఇదివరకే మణిరత్నం నాగార్జున కాంబినేషన్ లో ‘గీతాంజలి’ సినిమా వచ్చి కల్ట్ సినిమా గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా కూడా అదే కోవలో అందరి హృదయాలు దోచుకోవాలని ఆశిస్తున్నాం.