బాలీవుడ్: సుశాంత్ సింగ్ నటించిన చివరి సినిమా దిల్ బేచారా. నిన్ననే ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అయిన ఈ సినిమా రికార్డ్ ల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇదివరకే విడుదల అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ కూడా వ్యూస్ ప్రకారం చాల రికార్డులు క్రియేట్ చేసింది. ఇపుడు సినిమా కూడా అదే రికార్డుల బాట పట్టింది. IMDB అని అన్ని సినిమాల జాబితా అందులో ఉంటుంది. imdb లో అత్యధిక ఓట్లు మరియు అత్యధిక రేటింగ్స్ లభించిన ఇండియన్ సినిమాగా దిల్ బెచారా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకి ఈ రేటింగ్స్ రాలేదు. అలాగే చాలా మంది చూసిన ఓటీటీ సినిమాగా కూడా కొత్త రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. విడుదల అయిన 24 గంటల్లోనే 75 మిలియన్ వ్యూస్ సాధించింది ఈ సినిమా. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఓటీటీల్లో ఈ ఫీట్ సాధించలేదు.
ఈ సినిమాని సుశాంత్ కి ఘన నివాళి గా డిస్నీ హాట్స్టార్ ఓటీటీ వాళ్ళు ఈ సినిమాని ఫ్రీ గా అందుబాటులో ఉంచారు. అలాగే సినిమాకి కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా కథ పాతదే అయినా కూడా కథనం సాఫీ గా నడిచింది. ఒక మంచి ప్రేమ కథ కి ఆహ్లాదంగా ఉండే ఏ ఆర్ రెహమాన్ సంగీతం తోడవడం తో సినిమా చూస్తున్నంతసేపు మంచి ఫీల్ తో వెల్తూ ఉంటుంది. నిజ జీవితం లో లాగానే ఈ సినిమా కూడా ట్రాజెడీ తో ఎండ్ అవుతుంది. ఇలాంటి కథలు ఇంతకముందు చూసినా కూడా డైరెక్టర్ తన పని తనం చూపించి సినిమాలో లీనం అయ్యేలా చేయగలిగాడు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో పేస్ అని క్లైమాక్స్ హడావిడిగా ముగించాడు అనే కామెంట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ అయితే ప్రేక్షకులకి మిగులుతుంది.