మూవీడెస్క్: యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న స్వాగ్ మూవీపై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హసిత్ గోలి స్వాగ్ గురించి మాట్లాడుతూ, “ఇప్పటి వరకు చూడని ఇంటర్వెల్, క్లైమాక్స్ మీ ముందుకు రాబోతున్నాయి.
ఈ సినిమా 2024లోనే కాదు, రాబోయే ఏళ్లలో కూడా మరచిపోలేనిదిగా ఉంటుంది” అని తన కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేశారు.
స్వాగ్ సినిమా దసరా పండుగకు ముందు అక్టోబర్ 4న విడుదల కానుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
అలాగే, సీనియర్ నటి మీరా జాస్మిన్, సునీల్, దక్ష నాగర్కర్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపుతోంది.
శ్రీవిష్ణు ఈ చిత్రంలో నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనుండడంతో అంచనాలు మరింత పెరిగాయి.
“తెలుగు ప్రేక్షకులంతా గర్వపడేలా సినిమా ఉంటుంది” అని హీరో శ్రీవిష్ణు అన్నారు.