తాడేపల్లి: ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన శ్యాం కలకడ మరణించారు. ఆయన కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు. కాగా శ్యాం కలకడ మరణం పట్ల వైఎస్సార్‌సీపీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
ఆయనకు ట్విటర్ వేదికగా ఘన నివాళి అర్పించింది. “వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు పార్టీ కోసం అనుక్షణం పనిచేసిన క్రియాశీలక కార్యకర్త శ్యామ్ కలకడ అని కొనియాడారు. శ్యాం గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాధించాలని కోరుకుంటూ వైయస్ఆర్ సీపీ ఘన నివాళి అర్పిస్తోంది” అని ట్వీట్ చేసింది.
అలాగే శ్యాం కలకడ హఠాన్మరణం పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం ప్రకటించారు. “వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన శ్యామ్ కలకడ మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన కలిగించింది. శ్యామ్ మరణం పార్టీకి తీరని లోటు” అని శ్యాం కుటుంబ సభ్యులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.