మూవీడెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న SSMB29 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందబోయే ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గురువారం పూజా కార్యక్రమాలతో నిశ్శబ్దంగా ప్రారంభమైందని సమాచారం.
అయితే, ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని టాక్. హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా, విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఫైనల్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.
అయితే రాజమౌళి నుంచి ఇంకా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అంతర్జాతీయ స్థాయిలో హైప్ క్రియేట్ చేయడానికి జక్కన్న ప్రత్యేక పథకం రచిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజాగా, ఈ ప్రాజెక్ట్‌కి బాలీవుడ్ బిగ్ బ్యానర్ టి-సిరీస్ భారీగా ఫైనాన్స్ చేయబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యూజికల్ రైట్స్‌తో పాటు హిందీ థియేట్రికల్ రైట్స్ కూడా టి-సిరీస్‌కి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కూడా చర్చలు జరిగాయన్న టాక్ ఉంది. కానీ, చివరకు టి-సిరీస్ భాగస్వామిగా మారుతుందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమా కెన్యా సహా ఇండియాలో చిత్రీకరణ జరగనుంది.
ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు రెగ్యులర్ షూటింగ్ తేదీలపై జక్కన్న నుంచి అధికారిక ప్రకటన రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.