తాడిపత్రి: మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేత మాధవీ లత మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కొత్త సంవత్సరం వేడుకల్లో మహిళలకు ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహిస్తానని జేసీ చేసిన ప్రకటనపై మాధవీ లత అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదానికి మూలమైంది.
మహిళలకు ప్రత్యేక ఈవెంట్లు ఎందుకని మాధవీ లత ప్రశ్నించగా, ఆగ్రహించిన జేసీ ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య డైలాగ్స్ డోస్ గట్టిగానే పెరిగింది. వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో జేసీ బహిరంగంగా సారీ చెప్పారు.
అయితే, మాధవీ లత జేసీపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత పెరిగింది. తాజాగా, టీడీపీ మహిళా నేత కమలమ్మ మాధవీ లతపై తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు ఇరువురు కోణం కోణంగా కేసులు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో, సయోధ్య ఎప్పుడు కుదురుతుందో చూడాలి.