అమరావతి: ఏపీ లో పర్యావరణ రహిత, ఎలక్ట్రిక్ పరిశ్రమల ఏర్పాటుకు తైవాన్ కంపెనీల ఆసక్తి చూపుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏపీఐఐసీ కార్యాలయంలో తైవాన్ డైరెక్టర్ జనరల్‌తో కలిసి మంత్రి గౌతమ్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పీఎస్‌ఏ వాల్సిస్ 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తోందన్నారు. కాగా దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే పెట్టుబడులు, పరిశ్రమలపై ప్రకటన వెలువడుతుంది. ఏపీలో ‘ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్’ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కూడా తైవాన్ ఆసక్తి చూపుతోంది.
రూ.15వేల కోట్లతో విశాఖలో అదానీ డేటా సెంటర్ పెట్టుబడులు పెట్టనుంది. రాబోయే ఎస్‌ఐపీబీ సమావేశంలో సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. సెమీ కండక్టర్‌కు పెద్దపీట వేసే తైవాన్ కంపెనీలతో చర్చలు తొలిదశలో ఉన్నాయి. ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాకే పెట్టుబడులు, పరిశ్రమలు ఏర్పాటు జరుగుతుంది.
అయితే రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చే పరిశ్రమలను ప్రధానంగా తీసుకొస్తున్నాం. తాజాగా 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టే పరిశ్రమలు తీసుకొచ్చాం. అదాని డేటా సెంటర్, అపాచి కంపెనీల ద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. 40 వేల మందికి ఉద్యోగాలు అందుతాయి. తైవాన్‌తో ఈ-బై సైకిల్ ఎగుమతులపై సంప్రదింపులు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకోస్తాం, అని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు