మూవీడెస్క్: కన్నడ సుందరి రష్మిక మందన్న క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది.
బాలీవుడ్‌లో కూడా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న రష్మిక, సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
తన ఫ్యాన్స్‌తో తరచూ అనేక విషయాలను పంచుకునే ఆమె, గత కొన్ని వారాలుగా మాత్రం అంతగా కనిపించలేదు.
ఇప్పుడు ఇందుకు కారణం ఏంటో స్వయంగా రష్మిక వెల్లడించింది.
తనకు గత నెలలో ఒక చిన్న ప్రమాదం జరిగిందని, డాక్టర్ల సూచన మేరకు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పింది.
అయితే, త్వరలోనే షూటింగ్‌ల్లో పాల్గొంటానని ఫ్యాన్స్‌కు భరోసా ఇచ్చింది. “రేపు ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు, అందుకే ప్రతి క్షణం సంతోషంగా గడపండి” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పంపించింది.
ఇంకా, “మరొక అప్‌డేట్ ఏమిటంటే, లడ్డూలు బాగా తింటున్నాను!” అని సరదాగా రాసుకొచ్చింది.