మంగళగిరి: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మానిఫెస్టోలో ని ముఖ్య అంశం అయిన తల్లికి వందనం కింద 15,000 పై కీలక అప్ డేట్ ను మంత్రి నారా లోకేశ్ ఇచ్చారు.
కాగా, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ పథకం ఇస్తామన్ని ఆయన స్పష్టం చేశారు.
అయితే, మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు జరగకుండా చూస్తున్నామన్నారు.
శాసనమండలిలో మాట్లాడుతూ ఎంత మంది ఉంటే అందరికి 15000 ఇస్తాం, అందులో సంధేహం లేదు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని తెలిపారు.