టాలీవుడ్: సౌత్ లో సీనియర్ హీరోయిన్లు మెల్ల మెల్లగా ఓటీటీల బాట పడుతున్నారు. ఈ మధ్యనే కాజల్ అగర్వాల్ నటించిన ‘లైవ్ టెలికాస్ట్’ హాట్ స్టార్ లో విడుదలైంది. సమంత నటించిన ‘ఫామిలీ మాన్ 2 ‘ మరి కొన్ని రోజుల్లో విడుదల అవనుంది. తమన్నా మొదటిసారి నటించిన ఓటీటీ ఒరిజినల్ మూవీ ’11th అవర్’ ఏప్రిల్ 9 న విడుదల అవనుంది. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ లో సినిమా తాలూకు కథని పిల్లలకి చెప్పే బెడ్ స్టోరీ లాగా కారెక్టర్లని చూపించుకుంటూ చాలా అద్భుతంగా ప్రెసెంట్ చేసారు.
అనగనగా ఒక అడవిలో రెడ్ రైడింగ్ హుడ్ తన తల్లిని చూడడానికి బయలుదేరుతుంది, చీకటి పడుతుంది కానీ ఆ అడవిలో దారి తప్పుతుంది. అంటే ఇక్కడ తమన్నా తన తల్లిని చూడడానికి వచ్చి తన బిజినెస్ లో ఇరుక్కుపోతుంది. కథలో కొన్ని జంతువుల్ని, రాబందుల్ని, వోల్ఫ్ లాంటి వైల్డ్ అనిమల్స్ ని చెప్తూ ఆ కారెక్టర్లని వీడియో లో చూపించి తమన్నా ని తొక్కేయ్యడానికి జరుగుతున్న ప్రయత్నాల్ని బిట్స్ అండ్ పీసెస్ రూపం లో చూపించారు. ఇలా ట్రైలర్ ని ఇంటరెస్టింగ్ గా ప్రెసెంట్ చేసారు డైరెక్టర్.
పి.ఎస్.వీ గరుడావెగా, చందమామ కథలు లాంటి సినిమాల్ని డైరెక్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మరి కొన్ని పాత్రల్లో అదిత్ అరుణ్, శత్రు, రోహిణి ప్రకాష్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియా బెనర్జీ తదితరులు నటిస్తున్నారు. ఏప్రిల్ 9 నుండి ఈ సినిమా ఆహ ఓటీటీ లో స్ట్రీమ్ అవనుంది.