టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిందీ లో సూపర్ హిట్ అయిన ‘అంధాధున్’ సినిమా హక్కులు కొన్న విషయం తెలిసిందే. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కథాంశం. అలాగే నితిన్ కూడా ఇంతకముందు ఇలాంటి రకమైన సినిమాల్లో నటించలేదు. ఇందులో హిందీ లో టబు ఒక అద్భుతమైన పాత్రలో నటించి అందరిని మెప్పించింది. తెలుగు లో ఆ పాత్ర కోసం చాలా మందినే సంప్రదించారు కానీ ఎవరూ పాజిటివ్ గా రెస్పొంద్ అవలేదు తర్వాత అది తమన్నా దగ్గరికి వచ్చింది. తమన్నా ఈ పాత్రని ఒప్పుకోవడం తో ఇలాంటి చాలెంజింగ్ రోల్ ని తమన్నా స్వీకరించినందుకు అభినందిస్తున్నా కూడా టబు ని రీచ్ అయ్యేంత చేయగలదా అని ఆలోచిస్తున్నారు.
అలాగే హిందీ లో రాధికా ఆప్టే చేసిన పాత్రలో ఇస్మార్ట్ బ్యూటీ ‘నభ నటేష్’ ని ఎంపిక చేసారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ సొంత బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్, ఎక్ష్ప్రెస్స్ రాజా లాంటి ఎక్ష్ప్రెస్స్ సినిమాలని తీసిన ‘మేర్లపాక గాంధీ’ ఈ సినిమాకి డైరెక్షన్ వహిస్తున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిన ఈ సినిమాని నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. నితిన్ కి భీష్మ ద్వారా మంచి మ్యూజికల్ హిట్ ఇచ్చిన మణిశర్మ కుమారుడు ‘మహత్ సాగర్’ ఈ సినిమాని సంగీతం అందించబోతున్నాడు. ఇంకా మిగతా ఆర్టిస్ట్ ల వివరాలు త్వరలో ప్రకటించబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.