తమిళనాడు: సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయ రంగంలోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రిగ కజగం పేరుతో తన రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నిర్ణయం తమిళ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
విజయ్ రాజకీయ ప్రస్థానంలో మరింత మద్దతు పొందేందుకు ప్రముఖ వ్యూహ రచయిత ప్రశాంత్ కిషోర్ (పీకే) సహాయాన్ని పొందాలని ఆలోచోస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఇప్పటికే పీకేతో చర్చలు జరిపారని, త్వరలోనే అధికారిక ఒప్పందం జరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఇంతకుముందు పీకే బీజేపీ, వైసీపీ తరఫున పనిచేసి విజయవంతమైన వ్యూహాలను అమలు చేశారు. ఇప్పుడు విజయ్ పార్టీకి సహకరించేందుకు కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో విజయ్ రాజకీయ ప్రచారాన్ని బలపరిచేందుకు పీకే భారీ పాదయాత్ర లేదా బస్సు యాత్రను ప్లాన్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
విజయ్ పార్టీ తమిళ రాజకీయాల్లో కొత్త మార్పుకు నాంది పలకనుందా? పీకే వ్యూహాలు విజయ్‌కు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.