fbpx
Sunday, December 22, 2024
HomeMovie Newsఆకట్టుకుంటున్న ఆర్య 'సార్ పట్టా'

ఆకట్టుకుంటున్న ఆర్య ‘సార్ పట్టా’

TamilActor SarPatta MovieIntroduction

కోలీవుడ్: తమిళ నటుడు ఆర్య ప్రస్తుతం ‘సార్ పట్టా’ అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆర్య ఒక బాక్సర్ గా నటించబోతున్నాడు. రజినీకాంత్ తో ‘కబాలి’, ‘కాలా’ లాంటి సినిమాలని రూపొందించిన పా.రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఆర్య బ్రిటిష్ కాలంలో ఉండే బాక్సర్ గా నటిస్తున్నాడు. బ్రిటిష్ కాలంలో ఆటలో ఆంగ్లేయులతో పోరాడి నిలిచే పాత్రలో ఆర్య నటించబోతున్నాడు. ‘ఆంగ్లేయులతో రోషంగా పిడిగుడ్డు’ అనేది సినిమా టాగ్ లైన్.

ఈ సినిమాలో ఆర్య లుక్స్ బాడీ ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్యనే ఈ సినిమాలో ఆర్యతో పాటు మరిన్ని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా టీం ని పరిచయం చేస్తూ, వారి కష్టాన్ని కూడా ప్రెసెంట్ చేస్తూ ఒక వీడియో విడుదల చేసింది సినిమా టీం. ఆర్య ఈ సినిమా లుక్ కోసం ఎంత కష్టపడ్డాడో ఈ వీడియో ద్వారా చూపించారు.

ఈ సినిమాలో ఆర్య తో పాటు కలై అరసన్ హరి కృష్ణన్, పశుపతి, దూశారా విజయన్, జోన్ కొక్కెన్ , జాన్ విజయ్, కాళీ వెంకట్ నటిస్తున్నారు. వీరితో కూడా సినిమా వర్క్ షాప్ వీడియో లు కూడా ఈ మేకింగ్ వీడియో లో జత చేసారు మూవీ మేకర్స్. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని K9 స్టూడియోస్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్ పై షణ్ముగం దక్షన్రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల వివరాలు మరికొన్నిరోజుల్లో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular