కోలీవుడ్: సినిమాలు, షార్ట్ మూవీస్, సాంగ్స్, వెబ్ సిరీస్ లు ఇలా రక రకాల పేర్లతో గత కొన్ని సంవత్సరాలుగా సినిమా అభిమానులని పలకరించారు మూవీ మేకర్స్. ఇపుడు కొత్తగా అంథాలజీ సిరీస్ లతో మన ముందుకు వస్తున్నారు. ఈ మధ్యనే తమిళ్ లో విడుదలైన ‘పుత్తం పుదు కలై’ అనే అంథాలజీ సిరీస్ ఆకట్టుకుంది. ఇపుడు అదే దార్లో మరి కొన్ని సిరీస్ లు రానున్నాయి. కొందరు పెద్ద డైరెక్టర్ లు కలిసి వీటిని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ‘పావ కధైగల్‘ అనే అంథాలజీ సిరీస్ నెట్ఫ్లిక్ లో విడుదల అవబోతుంది. నలుగురు తమిళ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ గౌతమ్ మీనన్, వెట్రి మారన్, సుధా కొంగర, విగ్నేష్ శివన్ కలిసి ఈ అంథాలజీ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. నాలుగు కథల ఈ సిరీస్ డిసెంబర్ 18 నుండి అందుబాటులో ఉండబోతుంది.
ఈ సిరీస్ కి సంబందించిన ట్రైలర్ ఇవాల విడుదల చేసారు. ట్రైలర్ మొత్తం భావోద్వేగాలతో నిండి ఆకట్టుకుంది. రియలిస్టిక్ కథలని ఇష్టపడేవారికి ఇది తప్పకుండా నచ్చుతుంది. ఒక కుటుంబంలో లేదా ఇద్దరు ప్రేమికుల మధ్య, ఇద్దరు అన్నా చెల్లెళ్ళ మధ్య, తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమ, పరువు, గౌరవం లాంటి అంశాలు ఎలా ప్రభావితం చేస్తాయి అనే ప్రధానాంశం గా ఈ సిరీస్ రూపు దిద్దుకున్నట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.
తండ్రి నిర్ణయాన్ని కాదని వేరే అబ్బాయిని ప్రేమ పెళ్లి చేసుకున్న అమ్మాయి పాత్రలో సాయి పల్లవి, తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ తో ఒక కథని చూపించారు. మరొక కథలో ఆస్ట్రోనాట్ కావాలని కళలు కనే ఒక అమ్మాయి కి తండ్రి గా గౌతమ్ మీనన్, పరువు కోసం కూతుర్ని జీవితాన్ని ప్రభావితం చేసే తల్లి పాత్రలో సిమ్రాన్ తో ఒక కథని చూపించారు. ఒక లెస్బియన్ లవ్ స్టోరీ తో కాళిదాస్ జయరాం ప్రధాన పాత్రతో మరో కథని చూపించారు. ఇంకో హిందూ ముస్లిం ప్రేమ కథతో మరొక కథ చూపించారు. ఇలా నాలుగు కథలని నలుగురు డైరెక్టర్ లు దర్శకత్వం వహించారు. ఆర్ఎస్విపి మూవీస్ మరియు ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఈ సిరీస్ ని నిర్మించాయి.