కోలీవుడ్: తమిళ్ హీరోస్ విశాల్ మరియు ఆర్య ప్రధాన పాత్రలుగా ఒక మల్టీ స్టారర్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి సంబందించిన టైటిల్ మరియు టైటిల్ పోస్టర్ ఇదివరకే విడుదల చేసారు. ఇందులో ఆర్య నెగటివ్ షేడ్స్ ఉన్న కారెక్టర్ లో చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎనిమీ’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా నుండి విశాల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు సినిమా టీం. చేతిలో AK47 లాంటి ఒక పెద్ద గన్ పట్టుకొని చూస్తున్న లుక్ లో విశాల్ ఉన్నాడు. బాల రూపొందించిన ‘వాడు వీడు’ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించిన విషయం తెల్సిందే. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వీళ్లిద్దరు కలిసి నటిస్తున్నారు.
విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ అలాగే విక్రమ్ నటించిన ‘ఇంకొక్కడు’ సినిమాలకి దర్శకత్వం వహించిన ఆనంద్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మరొక ముఖ్య పాత్రలో గద్దల కొండ గణేష్ సినిమాలో నటించిన ‘మృణాళిని రవి’ నటిస్తుంది. వరుస విజయాలతో ఊపు మీదున్న థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న విశాల్ ప్రస్తుతం ‘చక్ర’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా లో ఒక ఆర్మీ మేజర్ రోల్ లో నటిస్తున్నాడు.