కోలీవుడ్: హాలీవుడ్ సినిమాల్లో ఆస్కార్ అవార్డ్స్ ఎంత ప్రసిద్ధి చెందినవో తెలిసిన విషయమే. మన సినిమాలు కూడా పోటీ కోసం పంపిస్తూ ఉంటాం. ఆస్కార్ తర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి అంత పేరుంది. అలాంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో రెండు తమిళ్ సినిమాలని స్క్రీన్ చేయబోతున్నారు. 2021 జనవరి లో లాస్ ఏంజిల్స్ లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో ఈ సినిమాలని స్క్రీన్ చేస్తున్నారు. ఈ గౌరవం దక్కించుకున్న సినిమాల్లో ఒకటి ధనుష్ నటించిన అసురన్ మరొకటి సూర్య నటించిన ‘సూరారై పొట్రు’.
వెట్రి మారన్ దర్శకత్వం లో వచ్చిన అసురన్ సినిమా అద్భుతమైన ప్రశంసలు పొందింది. వెట్రిమారన్ రియలిస్టిక్ కథ మరియు స్క్రీన్ ప్లే కి ధనుష్ అద్భుతమైన నటన తోడవడం తో ఈ సినిమా మంచి గుర్తింపు సాధించింది. ఈ సినిమాని తెలుగు లో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ అనే పేరుతో రీ-మేక్ చేస్తున్నారు.
గురు ఫెమ్ ‘సుధా కొంగర’ దర్శకత్వంలో ఎయిర్ డెక్కన్ వ్యయవస్తాపకుడు ‘కెప్టెన్ గోపినాథ్’ కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘సూరారై పొట్రు’, తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ అనే పేరుతో ఒకేసారి విడుదలైంది. ఈ సినిమా కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైంది. ఈ సినిమాకి వచ్చిన గుర్తింపు ఈ సినిమాని 2020 లో టాప్ సినిమా గా నిలబెటింది. సూర్య నటన సుధా కొంగర కథ, స్క్రీన్ప్లే మరియు తాను రాసుకున్న సీన్లు సినిమాని నెక్స్ట్ లెవెల్ లో కూర్చోబెట్టాయి.
అలాంటి అవార్డు ఈవెంట్ లో ఈ రెండు సినిమాలని స్క్రీన్ చేయడం అనేది ఒక గొప్ప గౌరవం. ఈ విషయాన్ని ఈ రెండు సినిమాల మేకర్స్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ షేర్ చేసారు.