చెన్నై: కేంద్రం ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానం (NEP) అమలు విషయంలో తమిళనాడు ప్రభుత్వం తేల్చి చెప్పింది. సీఎం స్టాలిన్ ప్రకటన ప్రకారం, కేంద్రం రూ.2 వేల కోట్లు ఇచ్చినా, రూ.10 వేల కోట్లు ఇచ్చినా తమ రాష్ట్రంలో NEP అమలు కాదని స్పష్టంగా తెలిపారు.
NEP ద్వారా హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం కనిపిస్తోందని స్టాలిన్ విమర్శించారు. తాము ఎలాంటి భాషా వ్యతిరేకులు కాదని, కానీ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
NEP అమలైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందుతున్న ఆర్థిక సాయం తగ్గిపోతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. అదనంగా, ఆర్ట్స్, సైన్స్ కాలేజీల్లో చేరాలంటే నీట్ తరహా పరీక్షలు తప్పవని అన్నారు.
ఈ విధానం అమలు వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని స్టాలిన్ హెచ్చరించారు. కేంద్రం ఎంత ఆఫర్ ఇచ్చినా, విద్యార్థుల హక్కులను కాపాడటమే తమ ప్రాధాన్యత అని స్పష్టంగా పేర్కొన్నారు.