కోలీవుడ్: కోలీవుడ్ సీనియర్ నటుడు కం కమెడియన్ వివేక్ నిన్న అస్వస్థతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గుండెపోటుకు సంబందించిన సమస్యతో బాధపడుతున్న వివేక్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. 59 ఏళ్ళ ఈ నటుడు అకస్మాత్తుగా మరణించడం తో తమిళ సినిమా ఇండస్ట్రీ నివాళులు తెలియచేస్తుంది. అంతే కాకుండా వివేక్ రజినీకాంత్ , ధనూష్ దగ్గరి నుండి హరీష్ కళ్యాణ్ లాంటి ఈతరం నటుల వరకు వరకు చాలా మంది స్టార్ నటులతో నటించారు.
తెలుగు లో ఈ నటుడు డైరెక్ట్ సినిమాలు చేయనప్పటికీ ఇక్కడి ప్రేక్షకులకి వివేక్ బాగా తెలుసు. ఎందుకంటే తెలుగు లో డబ్ అయ్యే పెద్ద సినిమాలన్నిట్లో వివేక్ కనిపిస్తాడు. రజినీకాంత్ తో శివాజీ సినిమాలో, అజిత్ తో వాలి, ఎంతవాడు కానీ, విశ్వాసం, ధనూష్ తో VIP (రఘువరన్ బి.టెక్), VIP2 , మాధవన్ తో చెలి సినిమాల్లో వివేక్ నటనకి తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా చాలా మంది ఆయనని అభిమానించారు. ముఖ్యంగా ‘బాయ్స్’ సినిమాలో ఆయన చేసిన ‘మంగళం’ పాత్రకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఆయన హీరోగా కూడా ఈ మధ్య ‘వెళ్ళై పూక్కల్’ అనే సినిమాలో ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించాడు.
సీనియర్ హీరోలతో చాలా సినిమాల్లో నటించిన వివేక్ మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు మంచి పాత్రలు చేస్తున్నా కూడా అకస్మాత్తుగా జరిగిన ఆయన మరణం ఆయన అభిమానులకి బాధని మిగిల్చింది. చివరగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్ 2 ‘ సినిమాలో నటించాడు. ఇప్పటికీ సినిమాల్లో మంచి క్వాలిటీ పాత్రలు వేస్తున్న ఈ నటుడు అకస్మాత్తుగా మరణించడం తో తమిళ సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి కి గురైంది.