కోలీవుడ్: తమిళ్ లో 5 గురు ఫేమస్ డైరెక్టర్లు కలిసి ఒక వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆ వెబ్ సిరీస్ ‘పుతం పుదు కలై’. ఐదు గురు డైరెక్టర్లు కలిసి లాక్ డౌన్ లో జరిగిన 5 కథలని ఒక్కొక్కరు ఒక్కో కథని డైరెక్ట్ చేసి మన ముందుకు తీసుకువస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ని గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, సుధా కొంగర, రాజీవ్ మీనన్, సుహాసిని మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన ట్రైలర్ ని ఇవాల విడుదల చేసారు. ప్రేమ , కొత్త ప్రారంభాలు, ఆశ, సెకండ్ ఛాన్స్ లాంటి అంశాల నేపథ్యంలో ఈ 5 కథలు రూపొందించారని ఈ ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. లాక్ డౌన్ లో జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ లాగ అనిపిస్తుంది.
మామూలుగా సౌత్ వెబ్ సిరీస్ లలో పెద్ద స్టార్స్ తక్కువ కనపడతారు. కానీ ఇందులో పెద్ద డైరెక్టర్స్ మూలంగా నటించిన స్టార్స్ కూడా మంచి పేరున్న వాళ్ళు ఎక్కువమంది ఉన్నారు. ఇందులో బాబీ సింహ, జయరాం, కాళిదాస్ జయరాం, శృతి హాసన్, ఊర్వశి, ఆండ్రియా, సుహాసిని, కళ్యాణి ప్రియదర్శన్, రైతు వర్మ, అను హాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ట్రైలర్ లో వినిపించిన మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. జీవీ ప్రకాష్ ఈ సిరీస్ కి సంగీతం అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘పుతం పుదు కాలై’ అక్టోబర్ 16న విడుదల కానుంది. సౌత్ ఇండస్ట్రీలోనే తొలిసారిగా వస్తున్న ఈ ప్రయోగాత్మక ఫిల్మ్ ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.