నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళుతోంది. విడుదలైన తొలి రోజు నుంచి హౌస్‌ఫుల్ షోలు నమోదు చేసుకున్న ఈ సినిమా, ఎనిమిదో రోజుకు గాను ప్రపంచవ్యాప్తంగా ₹95.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందనను అందుకుంటోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, హిందీ మార్కెట్‌లోనూ తండేల్ మంచి కలెక్షన్లు రాబడుతోంది. విదేశాల్లోనూ బ్రేక్-ఈవెన్ దిశగా వేగంగా దూసుకెళ్తుండటంతో ట్రేడ్ వర్గాలు 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం కచ్చితమని చెబుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, నాగ చైతన్య-సాయి పల్లవి కెమిస్ట్రీ సినిమాకు అదనపు బలంగా మారాయి.
తండేల్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడానికి కథ, బిజి తల్లి, హైలెస్సా పాటలు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మాస్, క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా కథా కథనాలు సాగినందువల్ల సినిమా నిలకడగా వసూళ్లు సాధిస్తోంది.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా, నాగ చైతన్య కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచే అవకాశముంది. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, ఈ వసూళ్ల దూకుడు చూస్తే తండేల్ 150 కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశం ఉంది.