టాలీవుడ్: తనీష్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘మహా ప్రస్తానం’. ఈ సినిమా టీజర్ ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేశాడు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ సింగిల్ షాట్ ప్యాట్రన్ మూవీ అనగా సినిమా కథ రెండు గంటల పాటు సాగుతుంది. సినిమా నిడివి కూడా రెండు గంటలు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి ఒక రాత్రి అంతా సాగిన కథలతో వచ్చిన సినిమాలను చూశాం. ఆ రాత్రంతా జరిగిన కథను రెండు లేదా రెండున్నర గంటల్లో చూపిస్తారు. కాని ఈ సినిమాలో మాత్రం కథ రెండు గంటల్లో మాత్రమే సాగుతుంది. అదే రెండు గంటల సినిమా ఉంటుంది.
సినిమా టీజర్ అంతా ఎక్కువ హింస తో కూడుకున్నట్టుగా కనిపిస్తుంది. కిడ్నాపింగ్ , చేస్ లాంటి థ్రిల్లింగ్ అంశాలతో ఉన్నట్టు కనిపిస్తుంది. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఓంకారేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే , డైరెక్షన్ ‘జానీ’ అనే కొత్త డైరెక్టర్ అందిస్తున్నారు. ఈ సినిమా మొత్తం కెమెరా యాంగిల్ లోనే ఉంటుంది. ఈ సినిమాకి బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు అలాగే సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.