బాలీవుడ్: థియేటర్ లు తెరుచుకునే అవకాశం దగ్గర్లో కనిపించకపోవడం తో విడుదలకి సిద్ధం గా ఉన్న సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ఓటీటీ బాట పట్టాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు ఎక్కువగా ఓటీటీ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. అందులో భాగంగా తాప్సీ నటించిన ‘హసీన్ దిల్ రూబా‘ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో విడుదలవనుంది. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.
ఒక వ్యక్తిని అరెంజెడ్ మ్యారేజ్ చేసుకుని ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రలో తాప్సీ ఈ సినిమాలో నటించింది. భర్త పాత్రలో విక్రాంత్ మాస్సే మరియు ప్రియుడి పాత్రలో హర్షవర్ధన్ రాణే నటిస్తున్నాడు. తానే తన భర్తని చంపించింది అనే కోణం లో తాప్సీ ని పోలీసులు అనుమానించి పోలీసులు ఇంటర్రోగేట్ చేయడం ట్రైలర్ లో చూపించారు. మరి కట్టుకున్న భార్యనే తన భర్త ని హత్య చేసిందా, లేక మరే కారణం ఏదైనా ఉందా, ఇదీ కాకుండా తానే హత్య చేసి తెలివి వాడి తనకు తెలియదు అని భార్య తప్పించుకుంటుందా.. అనే సస్పెన్స్ క్రియేట్ చేయడం లో సినిమా టీం సక్సెస్ అయింది.
ట్రైలర్ లో బోల్డ్ సీన్స్ చాలానే చూపించారు. తాప్సీ కూడా ఇద్దరు పాత్రలతో బోల్డ్ సీన్స్ లో కనిపించింది. టీ-సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్ పై హిమాన్షు శర్మ మరియు ఆనంద్ ఎల్. రాయ్ ఈ సినిమాని నిర్మించారు. వినీల్ మాత్యు దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లర్ జులై 2 నుండి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో విడుదల అవనుంది.