మూవీడెస్క్: తారక్ అందరిలా కాకుండా భిన్నంగా ముందుకు వెళ్తున్నారు.
తాను చేసిన తెలుగు సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సందడి చేయడమే కాకుండా, డైరెక్టర్స్ విషయంలో పాన్ ఇండియా ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు.
వివిధ ఇండస్ట్రీలకు చెందిన దర్శకులతో పని చేస్తున్నారు/ చేయనున్నారు జూనియర్ ఎన్టీఆర్. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర పార్ట్-1తో ఎన్టీఆర్ మరికొద్ది రోజుల్లో సందడి చేయనున్నారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ మూవీలో డ్యుయల్ రోల్ పోషిస్తున్నారు తారక్.
అయితే దేవర సెట్స్ పై ఉండగానే.. బాలీవుడ్ డెబ్యూ మూవీని తారక్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్-2లో కీలక పాత్ర పోషిస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఆ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారు.
ఇప్పటికే పలు షూటింగ్ షెడ్యూల్స్ లో తారక్ పాల్గొనగా, వచ్చే ఏడాది మూవీ రిలీజ్ కానుంది.
మరోవైపు, శాండల్ వుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నారు తారక్.
రీసెంట్ గా దేవర ప్రమోషన్స్ లో భాగంగా.. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తో మూవీ చేయాలనే తన కోరికను బయట పెట్టారు ఎన్టీఆర్.
మరో తమిళ డైరెక్టర్ అట్లీతోనూ మూవీ ఉంటుందని తెలిపారు. అట్లీ తనకు ఓ స్టోరీ లైన్ చెప్పినట్లు కూడా వెల్లడించారు.
దీని బట్టి చూస్తుంటే తారక్ లైనప్ లో అన్ని భాషల దర్శకులతో సినిమాలు ఉన్నాయి. మరి అవన్నీ హిట్ అయితే తారక్ కు తిరుగేలేదు.
ది పర్ఫెక్ట్ పాన్ ఇండియా హీరోగా మారి కెరీర్ లో దూసుకుపోవడం పక్కా!