తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పునరుజ్జీవానికి ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. విభజన అనంతరం పార్టీ బలహీనపడినప్పటికీ, పార్టీపై ఆశ చావలేదని సభ్యత్వ నమోదులో నమోదైన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కోటి మంది సభ్యత్వంతో బలమైన పార్టీగా అవతరించిన టీడీపీ, ఇందులో 1.60 లక్షల మంది సభ్యులు తెలంగాణ నుంచి ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ ప్రజలు ఇప్పటికీ టీడీపీకి ప్రాధాన్యత ఇస్తుండటంతో, పార్టీ సుప్రీమో చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణపై దృష్టి సారిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లోకేశ్ మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కీలక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
విభజన అనంతరం టీడీపీ పట్టుదల కోల్పోయినట్లుగా కనిపించినా, ఇప్పటికీ బలమైన కేడర్ కలిగి ఉండటం, ప్రజల్లో టీడీపీ పట్ల విశ్వాసం క్షీణించకపోవడం పార్టీకి ఆశలు కల్పిస్తోంది.
కొత్త కార్యక్రమాలతో ప్రజల మద్దతు పొందేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. త్వరలో తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.