ఏపీ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తన కార్యకర్తల కోసం మరోమారు వినూత్న కార్యక్రమం చేపట్టింది. పార్టీకి ప్రాణంగా ఉన్న కార్యకర్తల భద్రత కోసం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక బీమా ఒప్పందం జరిగింది.
ఈ కార్యక్రమం జనవరి 1, 2025 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బీమా స్కీమ్ కింద కోటి మంది టీడీపీ కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా అందించనున్నారు.
ప్రమాదంలో కార్యకర్త మృతి చెందితే రూ.15 లక్షలు కుటుంబానికి అందజేస్తారు. గాయపడిన వారికి రూ.50 వేల తక్షణ సాయం, మేజర్ ఆపరేషన్ అవసరమైతే రూ.2 లక్షల వరకు మద్దతు అందిస్తారు.
ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని పార్టీనే భరిస్తోంది. మొదటి విడత ప్రీమియం కింద రూ.42 కోట్లు ఇప్పటికే చెల్లించారు.
బీమా ప్రక్రియల పర్యవేక్షణ కోసం టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు, లోకేష్ ఈ నిర్ణయంతో కార్యకర్తలకు భరోసా కల్పించారంటూ ప్రశంసలు అందుతున్నాయి.