అహ్మదాబాద్: భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది. సిరీస్ లో తొలి బోణీ చేసింది. వెస్టిండీస్ నిర్ధేశించిన 177 పరగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు, లక్ష్య చేరువకు మధ్యలో కాసింత తడబడినప్పటికీ ఆఖరకు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత్ కు ఇది 1000వ వన్డే కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్ళింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(60), ఇషాన్ కిషన్(28) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి గెలుపుకు పునాది వేసారు.
చివర్లో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. విండీస్ బౌలర్లలో జోసఫ్ 2 వికెట్లు, అకీల్ హొసేన్‌కు ఓ వికెట్ దిక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా బుధవారం(ఫిబ్రవరి 9) జరగనుంది.