స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమ్‌ఇండియా 1-3తో పరాజయం పాలైన నేపథ్యంలో కీలక కోచింగ్ మార్పులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో బీసీసీఐ చర్యలు తీసుకోవడానికి ముందడుగు వేసింది.
తాజా సమాచారం ప్రకారం అభిషేక్ నాయర్‌తో పాటు ఫీల్డింగ్ కోచ్ తిలక్ దిలీప్, ఫిట్‌నెస్ ట్రైనర్ సోహమ్ దేశాయ్‌లు కూడా టీమ్‌ఇండియా కోచింగ్ ప్యానెల్ నుంచి తప్పుకోనున్నారు. ప్రధాన కోచ్‌గా గంభీర్ పదవి లో కొనసాగుతున్నప్పటికీ, అతను తీసుకున్న ఎంపికలపై ప్రస్తుతం పునర్విశ్లేషణ జరుగుతోంది.
కొత్త కోచింగ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ర్యాన్ టెన్ డెస్కాట్‌కు అసిస్టెంట్ కోచ్ పదవి ఇవ్వాలని బోర్డు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే ఫిట్‌నెస్ ట్రైనర్‌గా దక్షిణాఫ్రికా నిపుణుడు అడ్రియన్ లె రౌక్స్ పేరు పరిశీలనలో ఉంది.
జూన్‌లో ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే సిరీస్‌కు ముందు ఈ మార్పులు పూర్తవుతాయని అంచనా. బోర్డులో ఇప్పటి వరకు కొనసాగిన నిశ్శబ్దం చివరికి చర్యలకు దారి తీసింది. ఈ మార్పులతో జట్టు కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతుందా? ఫలితాల్లో మెరుగుదల వస్తుందా? అన్నది ఆసక్తికర అంశంగా మారింది.
teamindia, gautamgambhir, coachingchanges, bcci, abhisheknayar,