న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసాక భారత క్రికెట్ టీం కు హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పదవి నుంచి తప్పుకోనున్నారన్న వార్తలు వస్తోన్న నేపథ్యంలో తదుపరి కోచ్‌లుగా కుంబ్లే, ద్రవిడ్, సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరుల పేర్లు తెరమీదకు ఇప్పటికే వస్తున్న తరుణంలో తాజాగా మరో కొత్త పేరు వినిపిస్తోంది.
ఆ కొత్త పేరు ఎవరో కాదు ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ డైరెక్టర్ గ పని చేస్తున్న టామ్ మూడీ భారత జట్టు కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ దిశగా సన్రైజర్స్ హైదరాబాద్ పెద్దలు పావులు కదుపుతున్నారని క్రీడా వర్గాల్లో పుకారు నదుస్తోంది.
హైదరాబాద్ కు తొలి టైటిల్(2016) సాధించి పెట్టిన డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో సహా జట్టు నుంచి కూడా ఫ్రాంఛైజీ అతడిని తప్పించిన సంగతి తెలిసిందే. వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్‌ను సారథిగా నియమించారు. ఈ నిర్ణయాల వెనుక టామ్ మూడీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పలు మార్పులు చేసినప్పటికీ హైదరాబాద్ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఇక గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ తదితర విదేశీ కోచ్‌లు టీమిండియాకు శిక్షణ ఇచ్చారు.