మూవీడెస్క్: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు తేజ, “నేనే రాజు నేనే మంత్రి”తో సూపర్ హిట్ సాధించినప్పటికీ, ఆ తర్వాత మరొక పెద్ద హిట్ అందుకోలేకపోయారు.
ప్రస్తుతం ఆయన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, తేజ తన కుమారుడిని హీరోగా పరిచయం చేయడానికి ఒక ఫాంటసీ కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు ‘హనుమంతు’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ ఫాంటసీ కథలో లవ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని, తేజ తన కుమారుడి ఎంట్రీ కోసం ఇదే సరైన కథ అని భావిస్తున్నారట.
గతంలో తేజ లవ్ జోనర్‌లో విజయవంతమైన సినిమాలు తెరకెక్కించారు. ఇప్పుడు తన కుమారుడి కోసం కూడా అదే ఫార్ములాను ఉపయోగించాలని చూస్తున్నారు.
తాజాగా తేజ ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి హోంవర్క్ మొదలు పెట్టారని, తన కుమారుడిని సరైన సమయంలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత రావాలంటే తేజ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.