fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsఏప్రిల్ మూడవ వారంలో తేజ సజ్జ 'ఇష్క్'

ఏప్రిల్ మూడవ వారంలో తేజ సజ్జ ‘ఇష్క్’

TejaSajja IshqMovie ReleaseDateAnnounced

టాలీవుడ్: బాల నటుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన నటుడు తేజ సజ్జ. పెద్దయ్యాక ‘ఓ బేబీ’ సినిమాతో మరో సారి ఇండస్ట్రీ లో అడుగుపెట్టి ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా మొదటి సక్సెస్ చూసాడు. ఈ హీరో మంచి ప్లానింగ్ తో మొదటి సినిమా విడుదలకి ముందే వరుసగా సినిమాలని లైన్ లో పెట్టాడు. అందులో భాగం గానే ఇష్క్ అనే ఒక థ్రిల్లర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా విడుదల తేదీ ని ఈ రోజు ప్రకటించింది సినిమా టీం. షూటింగ్ ముగిసినా కూడా కరెక్ట్ విడుదల కోసం ఎదురు చూస్తున్న ఈ సినిమా నిర్మాతలు టక్ జగదీష్ సినిమా వాయిదా పాడడం తో ఆ తేదీ ని ఎంచుకుని విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాలో తేజ సజ్జ కి జోడీ గా నేషనల్ క్రష్, వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వాఱియర్ నటిస్తుంది.
ఈ సినిమా నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘ఆనందమానందమదికే’ పాట ఆకట్టుకుంది. ‘ఇష్క్’ – ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ అనే టాగ్ లైన్ తో ఈ సినిమా రాబోతుంది. మలయాళం లో రూపొందిన ‘ఇష్క్’ అనే సినిమాకి ఇది రీమేక్ అని వార్తలు ఉన్నాయి గాని అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో తెలుగులో మళ్ళీ రానుంది. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ , వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యస్.యస్.రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ 23 న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular