fbpx
Thursday, November 28, 2024
HomeTelanganaతెలంగాణ లో సెప్టెంబర్ 1 నుండి విద్యా సంవత్సరం

తెలంగాణ లో సెప్టెంబర్ 1 నుండి విద్యా సంవత్సరం

TELANGANA-ACADEMIC-YEAR-FROM-SEPTEMBER-1ST

హైద‌రాబాద్‌: క‌రోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపు లోకి రాని నేప‌థ్యంలో విద్యా సంస్థ‌లు ఇప్ప‌ట్లో తెరుచుకునే అవ‌కాశాలు లేనట్టున్నాయి. ఈ పరిస్థితులలో తెలంగాణ ప్ర‌భుత్వం డిజిట‌ల్ బోధ‌న ద్వారా ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించేందుకు సన్నద్ధ‌మైంది.

తెలంగాణ రాష్ట్రంలో వ‌చ్చే నెల 1 నుంచి పాఠ‌శాల‌ల్లో 2020-2021 విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అందులో భాగంగా సెప్టెంబ‌ర్ 1 నుంచి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వహించ‌నున్న‌ట్లు కూడా వెల్ల‌డించింది. ఈ మేర‌కు సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

మూడో త‌ర‌గ‌తి విద్యార్థులకు, ఆపై స్థాయి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల మేరకే ఈ త‌ర‌గ‌తులు ఉంటాయ‌ని పేర్కొంది. అయితే ఈ త‌ర‌గ‌తుల ప్రారంభానికి ముందే ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్ల‌కు రావాల్సి ఉంటుంద‌ని ఆదేశాలు జారీ చేసింది.

కాగా విద్యా సంవ‌త్స‌రం ప్రారంభంపై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఈ నెల 5న భేటీ జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో విద్యా సంవ‌త్స‌ర ప్రారంభం స‌హా అడ్మిషన్ల ప్రక్రియ, విద్యా బోధన ఎలా జ‌ర‌పాలి అన్న అంశాలపై ప్రభుత్వం చ‌ర్చించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular